Sep 15, 2024, 05:09 IST/
బస్సు కాలువలో పడి ఆరుగురు దుర్మరణం
Sep 15, 2024, 05:09 IST
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం దనసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బస్సు పర్వత మార్గం గుండా వెళుతుండగా అకస్మాత్తుగా లోతైన లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మందికి పైగా ఉన్నారు. వారిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.