Oct 29, 2024, 02:10 IST/జగిత్యాల
జగిత్యాల
మేడిపల్లి: క్రీడా ప్రాంగణంలో వరి సాగు
Oct 29, 2024, 02:10 IST
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో వరి పంట సాగు చేశారు. అయితే క్రీడా ప్రాంగణంలో పంటల సాగు చేయడం పట్ల స్థానికులు విస్మయానికి గురవుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయగా ఇక్కడి స్థలాన్ని ఎవరైనా ఆక్రమించారా? లేదా అప్పట్లో అధికారులు బోర్డు ఏర్పాటు చేసి బిల్లులు డ్రా చేసుకున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.