విద్యా రంగానికి పూర్వ వైభవం తీసుకొద్దాం: ఎమ్మెల్యే
రాష్ట్రంలో గత అయిదేళ్ల దుర్మార్గ, మొండి, ఏకపక్ష, కక్ష సాధింపు ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు చరమగీతం పాడారని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేసారు. గురువారం నందిగామ పట్టణంలో జరిగిన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పార్టు ఏపీ ) ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తంగిరాల సౌమ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.