Nov 23, 2024, 15:11 IST/
పెళ్లికూతురును తీసుకెళ్లేందుకు ఏకంగా హెలికాఫ్టర్ తెచ్చాడు (వీడియో)
Nov 23, 2024, 15:11 IST
యూపీలోని రుస్తాంపూర్లో జరిగిన ఓ పెళ్లి వేడుక వైరల్‌గా మారింది. రుస్తాంపూర్కు చెందిన అంజలి రాజ్‌పుత్‌ను మహమద్పూర్ గ్రామానికి చెందిన అమన్ గురువారం పెళ్లి చేసుకున్నాడు. అయితే శుక్రవారం తన భార్యను అత్తవారింటికి తీసుకెళ్లడానికి రూ.8లక్షలు పెట్టి ఏకంగా హెలికాఫ్టర్ ఏర్పాటు చేశాడు. వధువు తల్లి ఇంటి నుంచి తన ఇంటికి దూరం కేవలం 14 కిలోమీటర్లు ఉండడం విశేషం. గ్రామంలోకి హెలికాఫ్టర్‌లో రావడంతో ప్రజలందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.