MRO కార్యాలయం ముందు బట్టలు ఉతికి నిరసన

76చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మార్వో కార్యాలయం ముందు ఓ బాధితుడు చాకిరేవు పెట్టారు. కాళసముద్రం గ్రామానికి చెందిన గంగులప్ప తన భూమి కొలతలు వేసి పాసుబుక్ ఇవ్వాలని ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదంటూ బాధితుడు నిరసనకు దిగాడు. ఎమ్మార్వో కార్యాలయం ముందు బట్టలు ఉతికి నిరసన తెలిపాడు. భూమి కొలతలు వేసేందుకు VRO డబ్బులు అడుగుతున్నారంటూ గంగులప్ప ఆరోపిస్తున్నారు .

సంబంధిత పోస్ట్