మహారాష్ట్ర ఫలితాలు అనూహ్యమని.. దీనిపై సమగ్రంగా విశ్లేషిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇండియా’ కూటమికి అధికారాన్ని కట్టబెట్టిన ఝార్ఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 'ఈ విజయం.. రాజ్యాంగంతోపాటు నీరు, అటవీ, భూమి పరిరక్షణల విజయం కూడా. వయనాడ్‌లోని నా కుటుంబం (ఓటర్లు).. ప్రియాంకపై నమ్మకం ఉంచినందుకు గర్విస్తున్నా. వయనాడ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంక పాటుపడుతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.