కులాల ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్న ‘
ఇండియా’ కూటమికి ఈ ఎన్నికల్లో చుక్కెదురైందని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘2019 ఎన్నికల్లోనూ మహారాష్ట్రలో
బీజేపీ గెలిచింది. కానీ, ఉద్ధవ్ ఠాక్రే నమ్మక ద్రోహం చేశారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. ఝార్ఖండ్‌లో
బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.. బంగ్లాదేశ్ చొరబాట్లకు వ్యతిరేకంగా చివరి శ్వాస వరకు పోరాడుతుంది’ అని వెల్లడించారు.