అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు
వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో గల ఏకత్వ పాఠశాలలో గురువారం ఉదయం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడపా నాగ సూర్యవతి తెలిపారు. నాగ సూర్యవతి పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ అమరనేని సింధూరతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సూర్యవతి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయునికి కొత్త శకానికి నాంది పలికింది అని తెలిపారు.