విజయవాడ: గత ప్రభుత్వం తీరుపై హోంమంత్రి ఆగ్రహం
గత వైసిపి ప్రభుత్వం తీరుపై ఏపీ శాసనమండలిలో గురువారం హోం మంత్రి అనిత నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల ప్రభుత్వ పాలన అల్లకల్లోలం గురించి వదిలేసి ఐదు నెలల ప్రభుత్వంపై విమర్శలా? అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లు జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోయిన వారు కొత్త ప్రభుత్వాన్నిపీఆర్ సీల గురించి అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సత్యాలు చెప్పి సభలో సద్విమర్శ చేస్తే ఆలోచించుకుని సరి చేసుకుంటామన్నారు.