పసిపిల్ల‌ల ప్రాణం తీసిన ఎలుక‌ల మందు

78చూసినవారు
త‌మిళ‌నాడులోని కుంద్ర‌త్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. త‌మ ఇంట్లో ఎలుక‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో పెస్ట్ కంట్రోల్‌ కంపెనీతో మాట్లాడి ఓ వ్యక్తి మందును స్ప్రే చేయించాడు. మందు ఎక్కువ‌గా స్ప్రే చేయించ‌డంతో రాత్రంతా దానిని పీల్చి కుటుంబం మొత్తం అస్వ‌స్థ‌త‌కు గురైంది. ఇద్ద‌రు చిన్నారులు విశాలిని(6), సాయి సుద‌ర్శ‌న్‌(1) మృతి చెందారు.  బోరూరులోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో భార్య, భర్త చికిత్స పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్