విజయవాడ సెంట్రల్ - Vijayawada Central

జగన్ కు గుణపాఠం చెప్పాలి: కేశినేని జాన‌కి ల‌క్ష్మీ

జగన్ కు గుణపాఠం చెప్పాలి: కేశినేని జాన‌కి ల‌క్ష్మీ

ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించి.. దోపిడీయే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గుణపాఠం చెప్పాలని కేశినేని జాన‌కి ల‌క్ష్మీ అన్నారు. బిజెపి, జ‌న‌సేన బ‌ల‌పరిచిన టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్, టిడిపి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్ది బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు విజ‌యాన్ని కాంక్షిస్తూ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం 29వ డివిజ‌న్ మ‌ధురాన‌గ‌ర్ లో జాన‌కిల‌క్ష్మీ బుధ‌వారం ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం సాయిబాబా కాల‌నీ 1వ లైన్ నుంచి 13వ లైన్ వ‌ర‌కు, గ‌ద్దె బాబురావు రోడ్డు, రాఘ‌వ మస్తాన్ రావు రోడ్డుల‌లో సాగింది. జాన‌కి ల‌క్ష్మీ ఇంటింటికి వెళ్లి సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను ఓట‌ర్ల‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా జాన‌కి ల‌క్ష్మీ మాట్లాడుతూ మ‌ద్యం నిషేధంపై జ‌గ‌న్ ఇచ్చిన మాట‌ను తుంగ‌లో తొక్కాడ‌ని, జేబులో డ‌బ్బులు నింపుకునేందుకు మ‌ద్యం నిషేధం ప‌క్క‌న పెట్టి నాసిక‌ర‌కం మ‌ద్యం రాష్ట్రంలో పంపిణీ జ‌రిగేలా చూస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యం నాశ‌నం చేస్తున్నాడ‌ని తెలియ‌జేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ర‌ద్దు చేసి భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల పొట్ట‌కొట్టాడ‌ని, రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు రాకుండా చేసి యువ‌త జీవితాల‌తో ఆట‌లు ఆడుకున్నాడ‌న్నారు. అప్పుల‌పాలైన‌ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావాల‌న్నారు. ఇందు కోసం ఎన్డీయే అభ్య‌ర్దులైన బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ ఇన్చార్జి నెక్కంటి ప్రసాద్ , డివిజన్ ప్రెసిడెంట్ పి.వి.ఆర్., సెక్రటరీ సూరి, అంగిరేకుల వెంకట రాంబాబు, వెంకన్న, అరవింద్, ప్రసాద్, రత్తయ్య , సత్యనారాయణ,పైడి రాజు, కొండల రావు , జయరాం,రాజీ,రేణుకా, ఝాన్సీ, జనసేన పార్టీ ప్రెసిడెంట్ కెంబురి కృష్ణ, భవాని, రమణ లో పాటు బిజెపి, టిడిపి, జ‌న‌సేన నాయ‌కులు పాల్గొన్నారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా