అల్లు అర్జున్ హంగామా చేయకపోతే.. గొడవయ్యేదే కాదు: CM
సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. "అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చి.. సినిమా మాత్రమే చూడలేదు. కారులో నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ర్యాలీలా అభివాదం చేస్తూ వెళ్లారు. ఆయన ఎలాంటి హంగామా లేకుండా వచ్చి సినిమా చూసి ఉంటే ఈ గొడవ అయ్యేదే కాదు. ఈ ఘటన ఓ మహిళ చనిపోవడంతో పాటు 9 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని సీఎం ప్రశ్నించారు.