టీడీపీకి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు: ఎమ్మెల్యే అభ్యర్థి
టీడీపీకి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లేనని, తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. రాఘవేంద్రరెడ్డి ఓటర్లను కోరారు. కౌతాళం పట్టణంలో ఆయన ఇంటికి తిరుగుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ గురించి ప్రజలకు వివరించారు. టిడిపి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.