పగిడాల: ప్రజా ఉద్యమాలే సిపిఎం లక్ష్యం: సిపిఎం జిల్లా కార్యదర్శి.
సిపిఎం లక్ష్యం ప్రజా ఉద్యమాలను నిర్వహించి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడడం అని జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్ చెప్పారు. మంగళవారం పగిడాలలోని సిపిఎం కార్యాలయంలో మొదటి మహాసభ నిర్వహించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. నాగేశ్వరావు, ప్రజల పక్షాన ముందుండి పోరాడేది సిపిఎం పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పకిరి సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.