లక్ష్మీనగరంలో భారీ వర్షం
వెల్దుర్తి మండలం లక్ష్మీ నగరంగ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు, దాదాపు పది రోజులు పైగా వర్షం లేక పంటను ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ వర్షం కంది, పొగాకు, టమోటా, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వంటి పంటలకు మేలు చేకూరుస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.