కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు
కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం వర్షాలు కరిశాయి. ఈ వర్షాల వల్ల పంటలకు భారీగా నష్టం చేకూరే ప్రమాదం ఏర్పడింది. కొర్ర, సజ్జ పంటల కోతలు, నూర్పిడి చురుగ్గా సాగుతున్నాయి. ఈ వర్షాల వల్ల కంకులు తడిచి గింజల నాణ్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పత్తిలో కాయలు పగులుతున్నాయి. వర్షాలకు పత్తి తడవటం వల్ల నాణ్యత దెబ్బతింటోంది. ఓర్వకల్లు, వెల్దుర్తి, కర్నూలు మండలాల్లో వర్షాలు కురిశాయి.