AP: వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్ బంధువు అర్జున్ రెడ్డిలకు వైఎస్సార్ జిల్లా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న పులివెందులలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదవడంతో విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు చర్యలు చేపట్టారు.