తొమ్మిదేళ్లుగా సేవలు అందించిన విస్తారా విమానయాన సంస్థ సోమవారం సాయంత్రం తన చివరి సర్వీసును నడిపింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త సంస్థ విస్తారా.. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనమైంది. ఇక నుంచి విస్తారాకు సంబంధించిన హెల్ప్ డెస్క్, టిక్కెట్స్ వంటి అన్ని రకాల కార్యకలాపాలు ఎయిర్ ఇండియా చూసుకుంటుంది. కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా చివరి సర్వీసుకు సిబ్బంది తుది వీడ్కోలు పలికారు.