
కర్నూలు: ప్రతి ఇంటికి అభివృద్ధి.. ప్రతి జీవితానికి ప్రగతి
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4)తో "ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి" అనే వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమగ్ర అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా గ్రామీణాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.