
పెద్దకడబూరు: ఐదుగురిపై కేసు నమోదు : ఎస్ఐ నిరంజన్ రెడ్డి
పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణిలో పొలం రస్తా విషయంలో వీరనాగుడు దంపతులు, వారి కుమారిడిపై దాడి చేసిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి శనివారం తెలిపారు. రస్తా విషయంలో వీరనాగుడుపై దాడికి పాల్పడడంతో పాటు ఇంటి వద్దకు వెళ్లి వీరనాగుడు భార్యను అసభ్యకరంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.