పెద్దకడబూరు: యువతి అదృశ్యంపై కేసు నమోదు ఎస్ఐ నిరంజన్ రెడ్డి
తన చెల్లి అదృశ్యమైందని పెద్దకడబూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన శ్రీహరి పోలీసులను మంగళవారం ఆశ్రయించాడు. యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకీ తెలియలేదు. యువతి అన్న శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.