రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మద్యం ధర ముద్దు కూరగాయల ధరలు వద్దు అన్న చందగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తుందని సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ గురువారం ఆరోపించారు. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ లో వున్న కూరగాయల మార్కెట్ లో ఆయన మాట్లాడుతూ వర్షాలు వరదలతో రాష్టాలలో దిగుబడి తగ్గడంతో ఏపీ లో టమోటా , ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.