విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి: ఎమ్మెల్యే కాకర్ల
కొండాపురం మండలం మోడల్ స్కూల్ సమీపంలో కలిగిరి- ఓబులేటివారిపాలెం రహదారి విస్తరణ, పురనుర్ధరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమములో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించారు. కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థులందరూ కష్టపడి చదువుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడి సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు.