Oct 29, 2024, 03:10 IST/
ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు
Oct 29, 2024, 03:10 IST
ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇళ్లలో కరెంట్ వాడకపోయినా గతంలో కనీస ఛార్జీ కింద రూ.30 చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం దీన్ని రద్దు చేసింది. ఇది గృహజ్యోతికి అర్హులు కాని వారికి ఉపయోగపడనుంది. కాగా, కరెంటు ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. రూ.1200 కోట్ల ఆదాయం పెంచుకుంటామని ప్రతిపాదించగా అందులో రూ.1170 కోట్లు భరిస్తామని సర్కారు తెలిపింది.