పొదలకూరు: బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ఎంతో పేరు ప్రఖ్యాతలు గల మహమ్మదాపురం బీసీ బాలుర వసతి గృహాన్ని మోడల్ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పొదలకూరు మండలం మహమదాపురం దొడ్ల శంకరమ్మ బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. దాతలు దొడ్ల కుటుంబ సభ్యులు సొంత నిధులతో ఇంత పెద్ద పాఠశాలను ఈ గ్రామంలో నిర్మించడం జిల్లాకే గర్వకారణంగా ఆయన కొనియాడారు.