తిరుపతిలో ఓ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తిరుపతి రూరల్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న వెంకటప్రసాద్.. శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. 2012లో మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సోమవారం కనిపించకుండా పోయిన వెంకట ప్రసాద్.. తనపల్లి దగ్గర ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.