ఆస్ట్రేలియాలో 2015లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిని హత్యకు గురైంది. ఈ కేసులో ఆస్ట్రేలియా పోలీసులు హంతకులను పట్టుకోలేకపోయారు. దీంతో ప్రభా అరుణ్ కుమార్ (41)ని ఎవరు చంపారన్న ఆచూకి చెబితే మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇండియా కరెన్సీలో అయితే రూ. 5.5 కోట్లు అన్నమాట. అలాగే హత్యకు సంబంధించి ఆధారాల కోసం ప్రస్తుతం భారత్లో వేట మొదలు పెట్టారు.