ఈ అంశాలపైనా ఏఐ సమ్మిట్లో చర్చ
ఏఐపై ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి? ఎలాంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది?, ఇతర దేశాల్లో అమలవుతున్న విధానాలను చర్చించనున్నారు. అక్కడ ఏఐ విజయవంతమవడానికి ఉన్న పరిస్థితులు, మనం వాటిని అందిపుచ్చుకోవడానికి ఉన్న అవకాశాలు తదితర అంశాలపై ఏఐ సమ్మిట్లో చర్చించనున్నారు. కృత్రిమ మేధ వినియోగం, సమాజంపై దాని ప్రభావం, నియంత్రణ, సవాళ్లు, పరిష్కారాలపై చర్చిస్తారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు.