పదేళ్ల అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమకారుల ఆకాంక్షలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఉద్యమ సమయంలో యువకులు, ఉద్యమకారులు తమ గుండెలపై టీజీ(TG) అని రాసుకున్నందున.. రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చామన్నారు. ఉద్యమంలో జయజయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీని గౌరవించుకుని, ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు.