ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసును పోలీసులు చేధించారు. ఈ ఫోన్ కాల్స్ చేసిన నిందితుడ్ని పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయవాడలోని లబ్బిపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.