AP: విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవానికి శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలు కొన్నారు. వీటిలో కొన్నింటిని పిఠాపురంలో పెట్టబోయే గ్రంథాలయంలో ఉంచనున్నట్లు సమాచారం. రెండున్నర గంటలకు పైగా స్టాళ్లను పరిశీలించిన పవన్ కళ్యాణ్ పెద్ద సంఖ్యలో పుస్తకాలు కొన్నారు.