హైదరాబాద్‌లో సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ నెలకొంది. నగరంలోని కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. తెలంగాణ సహా ఏపీలోని వివిధ జిల్లాలు, ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు వస్తున్నారు. ప్రయాణికులతో బస్సులు నిండిపోతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా TGSRTC తగు సూచనలు చేస్తుంది. పండుగ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,432 ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతుంది.