స్టార్ హీరో కీలక విజ్ఞప్తి
కన్నడ స్టార్ హీరో యశ్ తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. తనపై చూపే ప్రేమ తీరును మార్చుకోవాలని కోరాడు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని బహిరంగంగా వేడుకలు చేయొద్దని కోరుతూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘నా బర్త్‌డే సెలబ్రేషన్స్ విషయంలో.. మీ అభిమానాన్ని, ప్రేమను గ్రాండ్ ఈవెంట్స్‌తో చూపే ప్రయత్నం చేయొద్దు. మీరంతా సురక్షితంగా ఉండడం, అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం, ఆనందంగా ఉండడమే నాకు పెద్ద బహుమతి’ అని పేర్కొన్నాడు.