ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు మృతి (వీడియో)
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శివనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. దాంతో ఇంట్లో నిద్రిస్తున్న 9 మందిలో ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మార్చురీకి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.