అన్నదమ్ములను చంపిన సోదరి కేసులో వీడిన మిస్టరీ (వీడియో)

58చూసినవారు
AP: గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం.. అన్నదమ్ములను సోదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకుపైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ములు, సోదరి మధ్య వివాదం కొనసాగుతోంది. దాంతో చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపీకృష్ణ, రామకృష్ణ ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణవేణి ఇద్దరు మైనర్ల సాయంతో అన్నదమ్ములను చంపేసింది.

సంబంధిత పోస్ట్