AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ పేర్ల వివరాల్లో తప్పులు సవరించుకోవచ్చు. ఈ నెల 19 నుంచి 23 వరకు విద్యార్థి పేరు, తల్లిదండ్రులపేర్లు, పుట్టిన తేదీ, మీడియం వంటి వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు. హెచ్ఎంలు తమ ఆన్‌లైన్ లాగిన్ ద్వారా ఈ సవరణ చేయవచ్చు. దీనికోసం అపార్ వివరాలతో విద్యార్థుల వివరాలను మరోసారి పరిశీలిస్తారు.