అందుకే నేను థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం మానేశా: పవన్ కళ్యాణ్ (వీడియో)
ప్రేక్షకుల అనుభూతిని పాడు చేయడం తనకు ఇష్టం లేదని.. అందుకే తాను థియేటర్‌కు వెళ్లి సినిమా చూడనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. "నేను నటించిన మూడో సినిమా తర్వాత థియేటర్‌కు వెళ్లడం మానేశా. సినిమా విడుదలైన రోజు ప్రతీ నటుడికి పరీక్ష సమయం. బహుశా ఆయన అందుకే థియేటర్‌కు వెళ్లి ఉంటారు. సినిమా బాగాలేకపోతే తిడతారు. అలాగే బాగుంటే ప్రశంసిస్తారు. నటుడు కూడా తన నటనకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో చూడాలనుకుంటారు." అని పవన్ అన్నారు.