Apr 08, 2025, 14:04 IST/
ఏపీలో భారీ వర్షం (వీడియో)
Apr 08, 2025, 14:04 IST
ఏపీలో ఎండలు, వానలు కలిసి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, అల్లూరి, కృష్ణా జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షం పడింది. రేపు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని పేర్కొంది.