AP: మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌సీఐ ఎండీని కలిశామని, ధాన్యం కొనుగోలు చెల్లింపుల వివరాలు అధికారులతో చర్చించామన్నారు. అలాగే కొనుగోలుకు ఎఫ్‌సీఐ అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. ఇక రబీ సీజన్‌లో కూడా ధాన్యం కొనుగోలు గురించి కూడా చర్చించినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.