AP: పీ–4తో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. దీంతో రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సీఎం ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు.