సింగరాయకొండ: కంటతడి పెట్టిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రంలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. గురువారం సాయంత్రం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులు రోదిస్తుండగా వారిని చూసి మంత్రి స్వామి కంటతడి పెట్టారు. బాధిత కుటుంబాలను ఓదారుస్తూ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.