కొండేపి: కంది పంటను పరిశీలించిన ఏఓ
కొండేపి మండలంలోని నెన్నూరుపాడు, గుర్రపడియలో మండల వ్యవసాయాధికారి డి. విజయకుమార్ అధ్యక్షతన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రబీ సీజన్లో వేసిన కంది పంట ప్రస్తుతం పూతదశలో ఉందని, పంటను మచ్చల పురుగు ఆశిస్తుందని అన్నారు. ఈ పురుగు నివారణకు పూత దశలో ఇండెక్సి కార్బ్ 200 మి.లీ/200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు.