అక్కడ కేజీ టమాటా రూపాయి
AP: నిన్న మొన్నటి వరకు టమాటాలు కొనాలంటేనే సామాన్యులు భయపడేవారు. మంచి ధర పలుకుతుండటంతో రైతులకు ఇవి లాభాలు ఆర్జించి పెట్టాయి. అయితే తాజాగా టమాటా ధర ఒక్కసారిగా దిగొచ్చింది. కర్నూలు జిల్లా పత్తికొండలో కిలో టమాటా ధర ఏకంగా రూపాయికి పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు టమాటాలను పారబోస్తున్నారు. మరో వైపు పలు ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.30-50 వరకు పలుకుతోంది.