మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. 'నా కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డాను. కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబం దూరంగా ఉంటోంది. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. అందులోని బాధితులకు నేను అండగా ఉన్నాను. అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని మనోజ్ అన్నారు.