AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో (ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య) భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ప.గో, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.