రాయలసీమ రుణం తీర్చుకుంటా: చంద్రబాబు

57చూసినవారు
రాయలసీమ రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
AP: రాయలసీమ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ తప్ప మరే పార్టీ హయాంలోనూ కడపలో అభివృద్ధి జరగలేదన్నారు. నదుల అనుసంధానం పూర్తయితే అభివృద్ధిలో రాయలసీమ పరుగులు పెట్టడం ఖాయమన్నారు. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందని, మళ్లీ తాము అధికారంలోకి వచ్చి పోలవరాన్ని పట్టాలెక్కించామన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు.