కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
AP: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జేఎల్ కోట హైవే కూడలిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బారువకు చెందిన హరీశ్ కుమార్ పాణిగ్రాహిగా గుర్తించారు. గాయపడిన అనిల్ కుమార్ పాణిగ్రాహిని సోంపేట ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.