చెన్నైలో ఓ జంట రోజూ 10వేలకు పైగా రామ చిలుకలకు ఆహారం అందిస్తోంది. దీని కోసం వారి ఇంటి డాబాపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 20 ఏళ్లుగా పక్షులకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో అక్కడ అతనిని 'బర్డ్ మ్యాన్' లేదా పారెట్ సుదర్శన్ అని పిలుస్తున్నారు. వేలకొద్ది పక్షులను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు అక్కడకి వస్తున్నారు. ‘సత్యం సుందరం’ మూవీలో అరవింద్ స్వామిని ‘బర్డ్ మ్యాన్’గా చూపించిన విషయం తెలిసిందే.