ఆస్ట్రేలియా క్రికెటర్ ఆది దేవ్ కన్నుమూత
ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ జరుగుతుండగా.. మరో వైపు విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఆది దేవ్ (23) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని డార్విన్ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అతను స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలతో కూడా మ్యాచ్లు ఆడాడు. అతను ఆల్ రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఆది దేవ్ మరణ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.