అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లు పట్టివేత

81చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లు పట్టివేత
గుడ్లూరు మండలం దప్పలంపాడు గ్రామ శివారు ప్రాంతంలో మున్నేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు కఠినతరంగా ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్